ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తోటి కార్మికుని కుటుంబానికి అండగా... రూ. 4.93 లక్షల విరాళం - srikakulam district workers union latest news

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిసాంలో ఉన్న శ్యాంపిస్టన్స్ పరిశ్రమ కార్మికుల సంఘం.. సమస్యలు ఎదురైనప్పుడు పోరాటాలే కాదు ఆపదలో ఉన్నవారికి చేయూతనందించడంలోనూ ముందుటారని సీఐటీయూ వెల్లడించింది. పరిశ్రమలో పనిచేస్తున్న తోటి కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందితే.. మిగతా కార్మికులంతా కలిసి మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారని అన్నారు.

Breaking News

By

Published : Oct 16, 2020, 7:39 PM IST


రణస్థలం మండలం వరిశాం వద్ద ఉన్న శ్యాంపిస్టన్స్ పరిశ్రమలో పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంచనా అప్పారావు కుటుంబాన్ని ఆదుకోవడానికి తోటి కార్మికులంతా ముందుకొచ్చారు. కార్మికులంతా కలిసి, ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చి.. 4,93,300 రూపాయలు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని చనిపోయిన కార్మికుడి కుటుంబ సభ్యులకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్. అమ్మన్నాయుడు శ్యాంక్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్​వీ.రమణ, కె.భోగేష్ అందజేశారు.

యూనియన్ పిలుపు మేరకు స్పందించి తోటి కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి కార్మికులంతా తమ ఒకరోజు వేతనాన్ని అందజేయడాన్ని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్. అమ్మన్నాయుడు అభినందించారు. విరాళాన్ని చనిపోయిన కార్మికుడి భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్యాంక్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం. కూర్మారావు, ఎం.రమణ, తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం అందించిన కార్మికులకు మృతిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి..

నీటి పాలైన మత్స్యసంపద.. ఆందోళనలో గంగపుత్రులు

ABOUT THE AUTHOR

...view details