ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంతబొమ్మాళిలో తాళ్లు అల్లుతామని పసిడితో పరార్‌ - శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో మహిళల ఘరానా మోసం వార్తలు

శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంత గ్రామాల్లో మహిళలు ఘరానా మోసానికి గురయ్యారు. బంగారు కాసుల పేర్లకు తాళ్ళు అల్లుతామని వచ్చిన ఇద్దరు మహిళలు.. అసలు బంగారం దాచేసి నకిలీ బంగారం అంటగట్టిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది.

Womens gharana cheating
సంతబొమ్మాళిలో ఘరానా మోసానికి పాల్పడ్డ మహిళలు

By

Published : Feb 14, 2020, 9:13 AM IST

సంతబొమ్మాళి మండలంలోని పిట్టవానిపేట, గద్దలపాడు, గొలుగువానిపేట, ఎం.సున్నాపల్లి, డి.మరువాడ గ్రామాల్లో 20 మంది మహిళలు మోసానికి గురయ్యారు. 40 తులాల వరకు బంగారం పోగొట్టుకున్నారు. గతేడాది డిసెంబరు నెలలో గ్రామాల్లో పర్యటించిన ఇద్దరు మహిళలు.. బంగారు కాసులపేర్లకు తక్కువ ధరకేతాళ్ళు అల్లుతామని, మెరుగు పెడతామని చెప్పారు. వారి మాటలు నమ్మిన మహిళలు... మెరుగు పెట్టించుకుని తాళ్ళు అల్లించుకున్నారు. మూడు రోజుల తరువాత వచ్చి కాసులపేర్లకు అల్లిక పువ్వులు పెడతామని చెప్పి, అసలు కాసుల పేర్లు మార్చేసి నకిలీవి అంటగట్టారు. రెండు నెలల తరువాత కాసుల పేర్లు రంగుమారడంతో అనుమానం వచ్చి బంగారం దుకాణాల్లో పరీక్ష చేయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇప్పటికే పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

సంతబొమ్మాళిలో ఘరానా మోసానికి పాల్పడ్డ మహిళలు

ఇవీ చూడండి...

రాజాంలో విద్యార్థి కిడ్నాప్ కలకలం

ABOUT THE AUTHOR

...view details