ఒడిశాలోని పల్లెకు వెళ్లాలని భర్త ఒత్తిడి, పిల్లల చదువుల కోసం ఇచ్ఛాపురంలోనే ఉంటానని ఆమె.. వెరసి ఒత్తిడిని భరించలేని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. బ్రాహ్మణవీధిలో అద్దె ఇంట్లో తన సోదరుడు జ్యోతిరాజ్తో కలసి ఉంటున్న ధర్మాన స్వాతి (29) సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది.
పిల్లల చదువు కోసం...
ఒడిశాలోని గంజాం జిల్లా అంతర్సింగ్‌లోని పల్లెకు చెందిన ధర్మాన బలరాంపాత్రోకు పదేళ్ల క్రితం స్వాతితో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బలరాంపాత్రో ఉపాధి కోసం ఖతర్ వెళ్లాడు. అక్కడే ఉండాల్సి రావడంతో పిల్లలతో సహా తన తల్లి వద్దకు ఉండమని భార్య స్వాతిపై ఒత్తిడి తెచ్చేవాడని జ్యోతిరాజ్ తెలిపాడు. ఇచ్ఛాపురంలో ఉంటే పిల్లల చదువులు సాగుతాయని ఆమె వాయిదా వేస్తూ వస్తోంది. తరచూ అత్తవారింటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటూ వచ్చేది.