ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి - srikakulam district newsupdates

ప్రస్తుత సమాజంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ అమిత్ బర్దార్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల పోలీస్ సాయుధ పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

Women should excel in all fields
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

By

Published : Mar 8, 2021, 12:59 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల పోలీస్ సాయుధ పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎస్పీ అమిత్ బర్దార్ ప్రారంభించారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కరోనా సమయంలో మహిళా వైద్యులు, సిబ్బంది కష్టపడి పని చేశారని అభినందించారు.

ప్రతి విజయంలో ఆడవాళ్ల పాత్ర తప్పనిసరిగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళాలకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. జెమ్స్ వైద్య సిబ్బంది ఆసుపత్రిలో మహిళలకు అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్​లకు మెమోంటోలతో సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details