Women protest: నీళ్ల కోసం ఖాళీ బిందెలతో.. మహిళల నిరసన - పలాసలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన
Women protest: శ్రీకాకుళం జిల్లా పలాసలో తాగునీటి కోసం మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఏడాదిగా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన
Women protest: శ్రీకాకుళం జిల్లా పలాసలో తాగునీటి కోసం మహిళలు ఆందోళన చేశారు. 29వ వార్డు రాజమ్మ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఏడాదిగా తాగు నీటి కోసం అల్లాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగిన మహిళలు.. తాగు నీరందించకపోతే.. పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చించారు.
ఇదీ చదవండి:'అబ్బయ్యచౌదరి స్వగ్రామంలో తనిఖీలకు వస్తారా'.. పోలీసులను అడ్డుకున్న వైకాపా నేతలు