శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని లొద్దపుట్టి సచివాలయంలో మహిళా పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న పాలబోయిన అరుణ కుమారి (34).. జ్వరంతో మృతి చెందారు. గొర్రెలవాణిపేట గ్రామానికి చెందిన ఆమె.. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ బుధవారం మృతి చెందినట్లు.. సంబంధిత అధికారులు తెలిపారు. ఈమెకు భర్త అప్పన్న బాబు, కుమారుడు సాయి తేజ (14 ), కుమార్తె నోమిని సాయి (10) ఉన్నారు. అరుణ కుమారికి ఏడాదిన్నర క్రితం దివ్యాంగుల కోటాలో ఉద్యోగం లభించినట్లు సిబ్బంది తెలిపారు. కాగా అప్పన్న సైతం దివ్యాంగుల కోటాలోనే.. పలాస పురపాలక కార్యాలయంలో సహాయకుడిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
జ్వరంతో మహిళా పోలీస్ మృతి - ఇచ్ఛాపురంలో జ్వరంతో మహిళా పోలీస్ మృతి
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని లొద్దపుట్టి సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళ పోలీస్.. జ్వరంతో మరణించింది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ.. అరుణకుమారి మృతిచెందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

women police death