శ్రీకాకుళం జిల్లా మొగిలిపాడు ప్రాథమికోన్నత పాఠశాలను పలాస జిల్లా పరిషత్ పాఠశాలలో విలీనం చేయొద్దంటూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా.. మంత్రి సీదిరి అప్పలరాజుపై మహిళలు మండిపడ్డారు. తమను గొర్రెల మందతో పోల్చారని ధ్వజమెత్తారు. సమస్యను కౌన్సిలర్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్తే.. ఎందుకు గొర్రెల మందలా ఇంత మందిని తీసుకొచ్చారని మంత్రి అన్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల మంద ఓట్లు వేస్తేనే అప్పలరాజు మంత్రి అయ్యారని.. ఈ సారి ఓట్లు అడగడానికి వచ్చినపుడు మంత్రికి సరైన సమాధానం చెప్తామని అన్నారు.
"మమ్మల్ని గొర్ల మంద అంటారా..? మంత్రికి గుణపాఠం తప్పదు" - schools merger in srikakulam district
మంత్రి అప్పలారాజుపై శ్రీకాకుళం మహిళలు మండిపడ్డారు. మొగిలిపాడు పాఠశాలను విలీనం వద్దంటూ.. తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తే.. దానిని పరిష్కరించాల్సింది పోయి.. తమను గొర్రెల మందతో పోల్చారని ధ్వజమెత్తారు. ఈ గొర్రెల మంద ఒట్లు వేస్తేనే అప్పలరాజు మంత్రి అయ్యారని.. త్వరలోనే తగిన గుణపాఠం నేర్పిస్తామని మండిపడ్డారు.
మంత్రిపై మండిపడ్డ మహిళలు