ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా భయం... అంతిమ మజిలీ దారుణం - శ్రీకాకుళం జిల్లా నేర వార్తలు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో హృదయ విదారకరమైన ఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్న మహిళను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. దీంతో ఆటో డ్రైవర్​ ఆ మహిళ మృతదేహన్ని నడి రోడ్డుపైనే వదిలి వెళ్లాడు.

ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన మహిళ మృతదేహం
ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన మహిళ మృతదేహం

By

Published : Apr 26, 2021, 11:05 PM IST

Updated : Apr 27, 2021, 5:10 AM IST

ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన మహిళ మృతదేహం

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అమానుష ఘటన జరిగింది. మందస మండలానికి చెందిన ఓ మహిళా అనారోగ్యంతో బాధపడుతుండగా సోమవారం కాశీబుగ్గ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆక్సిజన్ స్థాయి 35 శాతం ఉండటంతో సిటి స్కాన్ చేయించాలని సూచించారు. ఫలితంగా ఆమెను సిటిస్కాన్ కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిటీ స్కాన్ అనంతరం ఆటోలో అక్కడ నుంచి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన ఆటో డ్రైవర్ నడిరోడ్డుపైనే మృతదేహాన్ని దింపేశాడు. దిక్కుతోచని స్థితిలో కుటుంబీకులు పలాస నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం మందసకు ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తరలించారు. అయితే సిటి స్కాన్ లో ఆమెకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీనిపై మందస తహసీల్దార్ పాపారావు మాట్లాడుతూ.. తమకు అందిన సమాచారం మేరకు సంబంధిత మృతదేహాన్ని నేరుగా శ్మశాన వాటికకు తరలించే ప్రక్రియ చేపట్టామన్నారు.

Last Updated : Apr 27, 2021, 5:10 AM IST

ABOUT THE AUTHOR

...view details