ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య - శ్రీకాకుళంలో వివాహిత ఆత్మహత్య తాజా వార్తలు

కుటుంబ కలహాలతో ఓ వివావిత ఆత్మహత్య చేసుకున్న ఘటన.. శ్రీకాకుళంజిల్లా పాలకొండలో జరిగింది. విశాఖకు చెందిన ఉమాసీతామహాలక్ష్మి.. భర్త వినయ్​తో కలిసి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నివసించేంది. కుటుంబ కలహాల నేపథ్యంలో.. ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

By

Published : May 12, 2021, 8:43 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని రామ కళామందిర్ వీధి సమీపంలో.. ఉమాసీతామహాలక్ష్మి (ఉమా) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సీహెచ్ ప్రసాదరావు ప్రసాద్ దర్యాప్తు చేశారు. పాలకొండ పట్టణానికి చెందిన వినయ్ కుమార్​కు.. విశాఖకు చెందిన ఉమాతో తొమ్మిది నెలల కిందట వివాహమైంది.

కొద్ది రోజుల కిందటినుంచీ వీరిద్దరు.. వేరే ఇంట్లో ఉన్నారు. వారు కొత్తగా వ్యాపారం చేయాలని భావించారు. వినయ్ ను అతని తండ్రినుంచి డబ్బులు అడగాలని తరచూ భర్తను అడిగేదని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో పెరిగిన కలహాలతోనే.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details