విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపగుంటలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి మహిళ మృతి చెందింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి పెందుర్తి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద గోడ కూలిపోయింది. అలాగే పెందుర్తి అక్కిరెడ్డిపాలెం విద్యుత్ ఉపకేంద్రం వద్ద చెట్లు విరిగిపడిపోయాయి. జిల్లాలో రెండు తాటిచెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
GULAB EFFECT: కూలిన గోడలు.. విరిగిపడిన కొండచరియలు.. మహిళ మృతి - ఏపీ లేటెస్ట్ న్యూస్
గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఫలితంగా రెండు చోట్ల గోడలు, విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోయాయి. మరోచోటు కొండచరియలు విరిగిపడి మహిళ మృతి చెందింది.
శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం గడ్డకంచరంలో భారీ వర్షాలు, ఈదురు గాలులకు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలి 7 ద్విచక్ర వాహనాలు, 10 సైకిళ్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం రాత్రి సమయంలో జరగడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. తుపాన్ ప్రభావంతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో మూడు వందల వరకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతోపాటు లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలంలో ఎక్కడికక్కడ కాలనీలు నీటమునిగాయి. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, పలు వాణిజ్య పంటలు నేలమట్టమయ్యాయి.
ఇదీ చూడండి:GULAB EFFECT: తీరం దాటిన గులాబ్ తుపాను..గాలుల బీభత్సం