శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలోని అక్కవరం సమీపంలో రోడ్డుపక్కన చిమ్మచీకట్లో ఓ మహిళ భర్త మృతదేహంతో కొన్ని గంటలపాటు సాయం కోసం ఎదురు చూసింది. మంగళవారం రాత్రి ఎస్సై కామేశ్వరరావు విషయం తెలుసుకొని.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ఒడిశా బాలాసోర్‌కు చెందిన అంజలి అనారోగ్యానికి గురైన తన భర్త ప్రదీప్‌కుమార్‌ను హైదరాబాద్ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్ ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. ట్యాక్సీలో వెళుతుండగా టెక్కలి సమీపంలోకి వచ్చే సరికి ప్రదీప్‌కుమార్ మృతిచెందారు. ట్యాక్సీ డ్రైవరు అక్కవరం సమీపంలో రహదారి పక్కన మృతదేహాన్ని, ఆమెను దించేసి వెళ్లిపోయాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఎస్సై మరో ట్యాక్సీని మాట్లాడి మృతదేహంతోపాటు మహిళను బాలాసోర్ పంపేలా చొరవ చూపారు.
దారుణం: భర్త మృతదేహంతో.. చిమ్మ చీకట్లో.. - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
మానవత్వం మంట కలుస్తున్న ఉదంతాలు రాష్ట్రంలో పునరావృతమవుతునే ఉన్నాయి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడమే ఇందుకు సాక్ష్యం. ఇటీవల కాశీబుగ్గలో కరోనాతో మృతి చెందిన మహిళ మృతదేహన్ని రోడ్డు పై ఆటో డ్రైవర్ వదిలిపెట్టి వెళ్లగా...తాజాగా టెక్కలిలో ఓ ట్యాక్సీ డ్రైవర్... అనారోగ్యం కారణంగా మృతి చెందిన మరో వ్యక్తి మృతదేహన్ని నడి రోడ్డు పై విడిచి వెళ్లాడు. ఆ మృతుడి భార్య చిమ్మచీకట్లో గంటలపాటు సాయం కోసం ఎదురు చూసింది.
మృతదేహన్ని మధ్యలో వదిలేసిన ట్యాక్సీ డ్రైవర్