ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి స్థలం పట్టాను తిరిగిచ్చిన మహిళ - srikakulam updates

శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ... ప్రభుత్వం అందించిన ఉచిత ఇంటి స్థలం పట్టాను తిరిగి ఎమ్మార్వోకు అందించింది. తాను ఆర్థికంగా బాగున్నందునే పట్టాను తిరిగి అందించినట్టు చెప్పింది.

woman returned  to the house rails
ఉచిత ఇంటి పట్టాను తిరిగిచ్చిన మహిళ

By

Published : Jan 12, 2021, 11:46 AM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని ఇన్నేస్ పేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటి పట్టా వద్దంటూ తిరిగి ఎమ్మార్వోకు సోమవారం అందించారు. తన ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని చెబుతూ.. ఇన్నేస్ పేట వాసి కృష్ణారెడ్డి కుమార్తె జమున... డీసీఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయి రాజుకు పట్టాను తిరిగి ఇచ్చేసింది. ఎమ్మార్వో మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా.. డీసీఎంఎస్ ఛైర్మన్ సాయిరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందన్నారు. ఆర్థికంగా బాగున్నవారు ఉచిత పట్టాలు పొంది ఉంటే వెంటనే రెవెన్యూ అధికారులకు అందజేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details