ఆమదాలవలసలో మహిళ అనుమానాస్పద మృతి - Woman dies of suspicious death srikakulam district
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ఓ మహిళ బావిలో పడి మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బావిలో మహిళ మృతదేహం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో బావిలో పడి మృతిచెందింది. కళావతి అనే మహిళ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు.