ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి కూలీ మృతి.. దహన సంస్కారాలకు కుమారుడు దూరం - జగన్నాధపురంలో వడదెబ్బతో ఉపాధి కూలి మృతి వార్తలు

తల్లికి కుమారుడు అంతిమ సంస్కారాలను.. లాక్ డౌన్ కారణంగా చేయలేకపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లా జగన్నాధసాగరంలో విషాదం నింపింది. ఉపాధి పనులకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందిన తల్లిని.. లాక్ డౌన్ కారణంగా వేరే ప్రాంతాల్లో ఉండిపోయిన కుమారుడు, కుమార్తె చివరిచూపు కూడా చూసుకోలేకపోయారు.

woman died son not to come with lockdown at jagannathapalem srikakulam
ఉపాధి కూలీ మృతి

By

Published : May 13, 2020, 5:30 PM IST

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం జగన్నాధసాగరంలో ఉపాధి పనులు చేస్తుండగా కూలీ మృతి చెందింది. గ్రామానికి చెందిన పార్వతి ఉపాధి పనులు చేస్తుండగా.. వడదెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంపీడీవో సురేశ్ కుమార్​కు సమాచారమివ్వగా.. ఆయన వచ్చి పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధరించారు.

ఆసుపత్రికి తరలించి శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆమె కుమారుడు, కుమార్తె వేరే ప్రాంతాల్లో ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా వారు రాలేని పరిస్థితుల్లో కుటుంబసభ్యులే దహన సంస్కారాలు నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details