శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్ నిర్మాణంతోనే మత్స్యకారులు, గంగపుత్రుల వలసలను ఆపగలమని మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో భావనపాడు, దేవునల్తాడ, శ్రీరాంపురం తదితర గ్రామాల ప్రజలతో మంత్రి సమావేశమయ్యారు.
భావనపాడు పోర్టు నిర్మాణంతోనే గంగపుత్రుల వలసలను ఆపగలం: మంత్రి అప్పలరాజు అక్కడే నిర్మిస్తున్నాం..
13 బెర్తులు కలిగిన పోర్టును దేవునల్తాడ, భావనపాడుల మధ్య కడుతున్నామని పేర్కొన్నారు. 3 వేల 6 వందల కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం జరుగుతోందని మంత్రి వివరించారు. రెండు వేల నాలుగు వందల ఎకరాల భూసేకరణ కోసం అదనంగా 12 వందల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. స్థల సేకరణలో భాగంగా రెండు గ్రామాలను పూర్తిగా తరలిస్తామన్నారు.
ఇవీ చూడండి : అక్టోబరు 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ