ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు గారూ మా ప్రాంతం అభివృద్ధి కావొద్దా..?: ధర్మాన - ధర్మాన తాజా వార్తలు

రాజధాని  వికేంద్రీకరణ చేయడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యనించారు. గత ప్రభుత్వం అన్ని రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు.వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం.. పరిపాలనను, రాజధానిని వికేంద్రీకరిస్తూ ముఖ్యమంత్రి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

ధర్మాన ప్రసాదరావు
ధర్మాన ప్రసాదరావు

By

Published : Jan 20, 2020, 8:18 PM IST

ధర్మాన ప్రసాదరావు

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం.. పరిపాలనను, రాజధానిని వికేంద్రీకరిస్తూ ముఖ్యమంత్రి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యనించారు. మా ప్రాంతాల బాగు కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. అమరావతిలో ఆస్తులు కోల్పోతున్న వారి ఆవేదన పెద్దగా వినిపిస్తుండొచ్చు. కానీ.. మావి గొంతులు కాదా.. ? మా ఆకాంక్షలను పట్టించుకోరా..? పరిపాలన వికేంద్రీకరణను సమర్థిస్తూ ఇచ్చిన జీఎన్ రావు, బోస్టన్ నివేదికలను భోగి మంటల్లో వేస్తారా..? మీరు మంటల్లో వేసింది కాగితాలనే కాదు మా ఆశలను కూడా ..!?అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాజధానిని వికేంద్రీకరించకపోతే తప్పు కానీ.. మూడు రాజధానులు చేయడం ఏ మాత్రం తప్పుకాదని వ్యాఖ్యనించారు.

ABOUT THE AUTHOR

...view details