ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త మరణ వార్త విని భార్య మృతి - కొండంపేట భార్యభర్తల మృతి న్యూస్

భర్త మరణవార్త విన్న భార్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా కొండంపేటలో జరిగింది. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు.. మరణంలోనూ వీడిపోలేదంటూ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

wife died after husband death
భర్త మరణ వార్త విని భార్య మృతి

By

Published : Aug 23, 2020, 7:01 AM IST

వారిద్దరూ అన్యోన్య దంపతులు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారు. మరణంలోనూ వీరి బంధం కలిసే ఉంది. భర్త మరణించాడని తెలియగానే.. భార్య సైతం ప్రాణాలు వదలింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేటలో జరిగింది.

గ్రామానికి చెందిన డాక్టర్ సలాది రామారావు (75) గుండెపోటుతో మరణించారు. తన భర్త మరణించాడన్న విషయం తెలియగానే భార్య నిర్మల (65) సైతం ప్రాణాలు విడిచింది. దీంతో మరణంలోనూ కూడా ఇద్దరూ ఒకర్ని ఒకరు విడిచి ఉండలేక వెళ్లిపోయారంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details