పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం రెండో వార్డు నుంచి తెదేపా తరఫున వజ్జ గంగాభవానీ పోటీ చేస్తుండగా.. ఈమె భర్త వజ్జ బాబూరావు 23 వార్డు నుంచి పోటీలో ఉన్నారు. గంగాభవానీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్సిలర్గా గెలుపొందగా, బాబూరావు మున్సిపల్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 24వ వార్డు నుంచి వైకాపా తరఫున పోటీ చేస్తున్న బల్ల ఉష గతంలో కౌన్సిలర్‌గా చేశారు. ఈమె భర్త గిరిబాబు ఆరో వార్డు నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గిరిబాబు గతంలో కో-ఆప్షన్ సభ్యుడిగా ఉండేవారు. ఏడో వార్డు నుంచి తెదేపా తరఫున బడ్డ లావణ్య పోటీలో ఉండగా.. ఆమె భర్త నాగరాజు ప్రస్తుతం ఆరో వార్డు నుంచి తెదేపా తరఫున పోటీలో ఉన్నారు నాగరాజు గతంలో కౌన్సిలర్‌గా పని చేశారు.
పురపోరులో భార్యాభర్తలు.. ఎక్కడెక్కడ నిలుచున్నారంటే? - మున్సిపల్ ఎన్నికలు తాజా వార్తలు
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మూడు జంటలు(భార్యాభర్తలు) పోటీలో నిలిచాయి. వారిలో ఐదుగురు గత పాలకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించినవారే.
wife and husband in palasa muncipal elections