అన్యోన్యంగా జీవించిన ఆ దంపతులు మృతువులోనూ ఒక్కటయ్యారు. గంటల వ్యవధిలో భార్యభర్తలిద్దరూ మరణించారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సురవరం గ్రామంలో గంటా సీతారాం 30 ఏళ్లు రేషన్ డీలర్‌గా పని చేశారు. కొద్ది రోజులుగా దంపతులిద్దరికీ అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో భర్త సీతారాం మృతి చెందగా.. కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన భార్య జయమ్మ కూడా మృతి చెందింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. మరణంలోనూ వారి బంధం విడదీయలేనిదని స్థానికులు చెబుతున్నారు.
కరోనాతో భర్త మృతి..గంటల వ్యవధిలోనే భార్య మృతి - couple was died in Suravaram village
కడవరకు ఒకరికొకరు తోడుగా నిలుస్తామని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు ఆ దంపతులు. చేసిన ఆ బాసలను నిజం చేస్తూ మరణంలోనూ ఒక్కటయ్యారు. కరోనాతో భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే ఆయన సతీమణి మరణించింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సురవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
దంపతులు మృతి
ఇదీ చదవండీ..