ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నా మాటల్లో తప్పేముంది..?' - మంత్రి ధర్మాన కృష్ణదాస్ వార్తలు

నిరుద్యోగులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని... మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. తన మాటలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

minister dharmana

By

Published : Nov 24, 2019, 11:08 PM IST

మంత్రి ధర్మాన ప్రసంగం

ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... పట్ల యువత కృతజ్ఞతతో ఉండాలని కోరుకోవటంలో తప్పులేదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నిరుద్యోగులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంపై మంత్రి స్పందించారు. తన మాటలను కావాలనే కొందరు వక్రీకరించారని ధర్మాన పేర్కొన్నారు. తన మాటలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి పీఏసీఎస్ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పదవుల కోసం మనసును చంపుకునే రాజకీయాలు చేయనని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ABOUT THE AUTHOR

...view details