ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొంతు ఎత్తిపోతల పనుల్లో.. పశ్చిమ బంగా యువకుడు మృతి - బొంతు ఎత్తిపోతల పనుల్లో పశ్చిమ బంగా యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా బొంతు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎత్తిపోతల పనులు చేయడానికి పశ్చిమ బంగా నుంచి వచ్చిన కార్మికుల్లో ఒకరైన అబుజాద్ అనే యువకుడు విద్యుదాఘాతంతో మంగళవారం మృతి చెందాడు. తోటి కార్మికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.

పశ్చిమ బంగా యువకుడు మృతి

By

Published : Sep 18, 2019, 8:46 PM IST

పశ్చిమ బంగా యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బొంతు ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పదిరోజుల క్రితం పశ్చిమ బంగా నుంచి ఈ ప్రాజెక్టు పనుల కోసం వచ్చిన 10 మంది కార్మికుల్లో ఒకరైన అబుజాద్ (25)... విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో కార్మికుడికి స్పల్పగాయాలయ్యాయి. నిర్వాహకులు స్పందించి బాధితులను స్థానిక ప్రాథమిక కేంద్రానికి తరలించినా ఫలితం లేకపోయింది. అబుజాద్ స్వగ్రామం పశ్చిమ బంగా రాష్ట్రం ఉత్తర దినాజ్పూర్ జిల్లా బుడాన్ మదపూర్​ అని తోటి కార్మికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details