ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా అంతం కావాలని పశ్చిమబంగా నుంచి తిరుపతికి పాదయాత్ర - ఏపీ వార్తలు

కరోనా అంతం కావాలని పశ్చిమబంగా ఖరగ్​పూర్ నుంచి తిరుపతికి ఓ వ్యక్తి పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 10న ప్రారంభమైన ఆయన పాదయాత్ర శనివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చేరింది.

West bengal person
West bengal person

By

Published : Nov 29, 2020, 6:01 AM IST

కరోనా పూర్తిగా అంతం కావాలని పశ్చిమబంగాకు చెందిన అద్దంకి రవి పాదయాత్ర చేపట్టారు. పశ్చిమబంగా ఖరగ్​పూర్ నుంచి తిరుపతికి ఈ నెల 10వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై లొద్దపూట్టి కూడలి వద్ద స్థానికులు అద్దంకి రవికి స్వాగతం పలికారు. కరోనా వైరస్ అంతమై, దేశానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details