శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురంలో సభాపతి తమ్మినేని సీతారాం.. లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్రప్రభుత్వం పేదలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేస్తోదని తమ్మినేని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తున్నామన్నారు.
అధికారులపై ఆగ్రహం
ఆముదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం అధికారులతో తమ్మినేని సమీక్ష నిర్వహించారు. ఆముదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి మండలాల్లో ఇంకా ఎందుకు పనులు ప్రారంభించలేదని అధికారులను ప్రశ్నించారు. కోట్ల రూపాయలతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే అమలు చేయకుడా నిర్లక్ష్యం వహిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గ్రామాల్లో పనులు ప్రారంభిచాలని ఆదేశించారు.