కరోనా వేళ కళ్యాణమే తప్ప వైభోగం లేకుండా పెళ్లిళ్లు చేసుకోడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవడం తప్పిస్తే ఇతరత్రా కార్యకలాపాలకు అవకాశం ఇవ్వడం లేదు. ఇరు వర్గాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించి నిబంధనలు పాటించి వివాహం చేసుకోడానికి అనుమతులు ఇస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు వివాహ ముహూర్తాలు ఉండడంతో అధిక సంఖ్య లోనే పెళ్లిళ్లకు సమాయత్తమవుతున్నారు. లక్షల్లో చేసే వ్యయం మిగలడం తోపాటు అందరినీ పిలిచి హంగామా చేసే ప్రయాస తగ్గుతుందనే భావనతో చాలా జంటలు ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.
20 మందికే అనుమతి..
వివాహం సమయంలో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. వీరంతా భౌతిక దూరం పాటించడంతో పాటు, మాస్కులు, శానిటైజర్లు వినియోగించాల్సి ఉంటుంది. వివాహం ముగిసేంతవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
దంపతులకు కరోనా పరీక్షలు .. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కరోనా లేనట్లయితే అందుకు సంబంధించిన పత్రం అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. కరోనా సోకితే వివాహాలకు అనుమతి ఉండదు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి పూర్తి వివరాలతో దరఖాస్తు చేస్తే అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు ఇస్తారు.దీనికి గాను వధువు, వరుడు కుటుంబాలకు సంబంధించి కేవలం 20 మందితో మాత్రమే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ పెళ్లి జరుగుతుందో సంబంధిత కుటుంబ సభ్యులు, వధువు, వరుడు ఆధార్ వివరాలు, లగ్నపత్రిక, ఇతర సమాచారంతో కూడిన దరఖాస్తు తహసీల్దార్ తోపాటు పోలీసు స్టేషన్‌కు అందజేయాలి.తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీసుస్టేషన్‌కు సమాచారం పంపిస్తారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇప్పటికే 15 వందలకు పైగా పెళ్లిళ్లు జరగగా మరో 16 వందల దరఖాస్తులకు అనుమతులిచ్చారు.
ఆగస్టు నుంచి ...: