ప్రజా సమస్యల పరిష్కారానికి రూపొందించిన ఓ వెబ్సైట్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ వెబ్సైట్ను డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ రూపకల్పన చేశారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో వ్యయ, ప్రయాసలకోర్చి తన క్యాంపు కార్యాలయానికి వస్తున్న వారు ఇకపై పిరియాసాయిరాజ్.కామ్ (http://www.piriyasairaj.com) అనే వెబ్సైట్ ద్వారా తమ సమస్యలు, ఫిర్యాదులు పంపవచ్చని డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ అన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక వెబ్సైట్ను రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా నరసన్నపేటలో ప్రారంభించారు. సమస్యతో పాటు సంబంధిత అర్జీలు, డాక్యుమెంట్లను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చని సాయిరాజ్ తెలిపారు.