జగనన్న నేతన్న నేస్తం పథకానికి అర్హులమైనప్పటికీ తమను ఎంపిక చేయటం లేదంటూ పలువురు చేనేత కార్మికులు గురువారం సంతకవిటి గ్రామ సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. కొందరి మాటలు విని వాలంటీరు తమకు అన్ని అర్హతలున్నప్పటికీ జియో ట్యాగింగ్ చేయకుండా అన్యాయం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా తమ మూడు కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, చేనేత సంఘంలో గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ పథకానికి ఎంపిక చేయకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
'పథకానికి అర్హులమైనా ఎంపిక చేయట్లేదు' - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి గ్రామ సచివాలయం వద్ద చేనేత కార్మికులు నిరసన తెలిపారు. వాలంటీరు తమ మాటలు పెడచెవినపెట్టి అర్హత ఉన్నా... జియో ట్యాగింగ్ చేయకుండా తమకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు.

సచివాలయం వద్ద నిరసన తెలుపుతున్న చేనేత కార్మికులు