నరసన్నపేట నుంచి మారుతీ నగర్ మీదుగా జలుమూరు మండలానికి వెళ్లే రోడ్లు భవనాల శాఖ రహదారిపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. గొట్టిపల్లి మార్గంలో మారుతీ నగర్ వద్ద జాతీయ రహదారిపై వంతెన దిగువ చిన్నపాటి వర్షం పడితే చాలు ఇలా నీరు నిలిచిపోతోంది. రోజుల తరబడి నిలిచిపోయిన నీరు బయటకు వెళ్ళక.. ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా ఈ పరిస్థితి నెలకొంది. మేజర్ పంచాయతీ ఈవో మోహన్ బాబు స్పందించి ప్రొక్లెయినర్ ద్వారా ప్రత్యేక కాలువ తవ్వించి నీటిని మళ్లించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
రహదారిపై నిలిచిన నీళ్లు..ప్రయాణికుల అవస్థలు - Water standing on road- passengers facing problems
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రెండు మండలాలను కలిపే రహదారిపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.
రహదారిపై నిలిచిన నీరు- అవస్థలు పడ్డ ప్రయాణికులు
TAGGED:
PRABHUSARMA