రాష్ట్రంలోని 351 మండలాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 44 మండలాల్లో సమస్య ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే 282 ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు. ఈ రెండు మినహా 10 జిల్లాల్లో ప్రస్తుతం కొరత లేకున్నా.. వచ్చే 2నెలల్లో వాటిలోని 6,355 ఆవాసాల్లో సమస్య ఏర్పడొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఈ కారణంగా... తాగునీటి ఎద్దడి తీర్చడానికి రూ.109.81 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. ఆవాస ప్రాంతాలు, పశువుల దాహార్తి తీర్చడానికి ట్యాంకర్లతో నీటి సరఫరా, వ్యవసాయ బావులు అద్దెకు తీసుకోవడం, బోర్లు, బావుల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. విజయనగరం జిల్లాలో నీటి కొరత రాదని భావిస్తున్నారు.