ప్రతి ఒక్కరిలో ఆలోచనలు, అలవాట్లు మారితే పల్లెలు పరిశుభ్రంగా ఉంటాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో మనం-మన పరిశుభ్రతలో భాగంగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నివాస్, జేసీ శ్రీనివాసులతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈరోజు నుంచి ఈనెల 21వ తేదీ వరకు జిల్లా, మండల, గ్రామస్థాయిలో మనం-మన పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న మంత్రి.. అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి.. పారిశుద్ధ్య నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు.