ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైడ్రోజన్ ఇంధనంవైపు అడుగులు.. ఫలిస్తున్న యువకుడి పరిశోధనలు

హైడ్రోజన్ ఇంధనం.. దీనిపై ప్రపంచం వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది వాడకంలోకి వస్తే తక్కువ ఖర్చుతో, ప్రర్యావరణానికి హితంగా ఇంధనం తీసుకురావచ్చు. దీన్ని క్రమ పద్ధతిలో తీసుకొచ్చేందుకు స్టెబిలైజర్లను అభివృద్ధి చేయడానికి తర్జనబర్జన పడుతున్నారు. డీఆర్డీవోతో కలిసి విశాఖ యువకుడు నాలుగేళ్ల పాటు కష్టపడి ఇన్వర్టర్​ను రూపొందించి.. ప్రత్యేక గుర్తింపు పొందాడు.

vizag man research on hydrogen invertor
హైడ్రోజన్ ఇంధనంపై విశాఖ యువకుడి పరిశోధన

By

Published : Jul 9, 2020, 8:57 PM IST

పునరుత్పాదక వనరుల కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు బాగా వాడుకలోకి వచ్చింది సౌర విద్యుత్తు. పలకలో ఏర్పాటు, ఒక పూటే విద్యుత్ ఉత్పత్తి... ఈ పరిమితుల దృష్ట్యా సౌర విద్యుత్తు ఇప్పటికీ అనుకున్నంత వేగంగా వినియోగంలో లేదన్నది వాస్తవం. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో హైడ్రోజన్ ఒక ప్రధాన అంశం.

నీటి నుంచి ఈ వాయువును వేరుచేసి చోదకశక్తిగా మారిస్తే అత్యంత చౌకగా, వందశాతం కాలుష్య రహితంగా అటు వాహనాలు, ఇటు గృహ విద్యుత్తుకు కూడా కావాల్సినంత ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందన్నది పరిశోధకుల అంచనా. ఇందులో కావాల్సిందల్లా ఈ శక్తిని నిర్ణీత స్దాయిలో పుట్టించి ఒక క్రమ పద్ధతిలో వినియోగానికి తెచ్చే స్టెబిలైజర్లను అభివృద్ధి చేయడం.

సరిగ్గా ఇక్కడే పరిశోధనలకు బ్రేక్ పడుతూవస్తోంది. విశాఖకు చెందిన బంకుపల్లి ఫణితేజ ఈ తరహా ప్రాజెక్టును రక్షణ పరిశోధన అభివృద్ది సంస్ద (డీఆర్డీవో)తో కలిసి పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందాడు. రాయ్ పూర్ లోని ఎన్ఐటీలో దాదాపు నాలుగేళ్ల పాటు శ్రమించి ఇన్వర్టర్​ను కొంత వరకు అభివృద్ది చేయగలిగాడు.

కాకినాడ జేఎన్టీయూలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో బీటెక్, ఎంటెక్ పట్టాలను తీసుకున్న ఫణితేజ.. జూనియర్ రిసెర్చిఫెలోను సాధించి చత్తీస్ ఘడ్ - రాయ్ పూర్ లోని ఎన్ఐటీలో పరిశోధన కోసం చేరాడు. అక్కడే డీఆర్డీవో ప్రాజెక్టులో పని చేశాడు. హైడ్రోజెన్ ను ఇంధనంగా స్టెబిలైజ్ చేసే ఇన్వర్టర్ చేయడానికి తగిన పరికరాన్ని అభివృద్ది చేయడం కోసం డాక్టర్ సుభోజిత్ ఘోష్, సచిన్ జైన్, సుసోవాన్ సమంతలతో కలిసి పని చేశాడు. ప్రస్తుతం టెక్కలిలోని ఓ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా పని చేస్తున్నాడు

లాబోరేటరీ ప్రోటోటైప్ పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్టర్, నెక్సా పెమ్ ఫ్యూయిల్ సెల్, పీవీ ఇములేటర్ వంటి వాటిని ఫణితేజ అభివృద్ది చేశాడు. ఈ ఇన్వర్టర్ మాడ్యూల్ ఇంకా అభివృద్ది చేసి ఇప్పుడు అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించేందుకు తన పోస్ట్ డాక్టరల్ పరిశోధనలపై దృష్టి పెట్టినట్టు వివరించారు. దీనిపై పనిచేసేందుకు డీఆర్డీవోకు మరో కొత్త ప్రాజెక్టు ప్రతిపాదలను ఇవ్వనున్నట్టు చెప్పాడు. వాణిజ్య పరంగా మోడల్ ఫలవంతమైతే పూర్తి కాలుష్య రహిత వాహనాలు రొడ్డెక్కేందుకు వీలవుతుందన్నారు.

హైడ్రోజన్ ఇన్వర్టర్ పై యువకుని పరిశోధనలు

ఇదీ చదవండి:కరోనా ప్రమాదకరమని తెలుసు.. కానీ ఎలా సంక్రమిస్తుంది..?

ABOUT THE AUTHOR

...view details