ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ శారదా పీఠం తరుపున.. సీతారాములోరికి కానుకలు - సీతారామపురంలోని సీతారాముల ఆలయం వార్తలు

విశాఖ శారద పీఠం తరుపున శ్రీకాకుళం జిల్లా సీతారామపురం గ్రామంలోని సీతారాముల ఆలయంలోని సీతారాముల వారికి.. వెండి కిరీటాలు, పట్టువస్త్రాలను అందజేశారు. స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఆలయాన్ని సందర్శించి.. వెండి కిరీటాలు, పట్టువస్త్రాలను బహూకరిస్తామని ప్రకటించారు.

Visakha Sharda Peetam Presentation
సీతారాములోరికి కానుకలు అందజేస్తున్న విశాఖ శారదాపీఠం

By

Published : Apr 20, 2021, 7:21 PM IST


శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధి సంతకవిటి మండలం గుళ్ల సీతారామపురం గ్రామంలోని పురాతన సీతారాముల ఆలయం ఉంది. ఇక్కడ సీతారాములు దేవతామూర్తులకు.. వెండి కిరీటాలు, పట్టువస్త్రాలను విశాఖపట్నం శారదా పీఠాధిపతి శిష్య బృందం ఆధ్వర్యంలో ఆలయ పురోహితులు భోగాపురం ప్రసాద్ శర్మకు అందజేశారు. సీతారాముల ఆలయాన్ని స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా సందర్శించారు. అక్కడి పరిస్థితిని చూసిన స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆవేదనకు గురయ్యారు.

ఆలయ దుస్థితిని చూసిన శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి.. సీతారాముల విగ్రహాలకు విశాఖ శారద పీఠం తరపున.. వెండి కిరీటాలన బహూకరిస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు శ్రీరామనవమికి ముందుగానే వెండి కిరీటాలను.. ఆలయ పురోహితులకు అందజేశారు. శ్రీరామనవమి వేడుకల కోసం విశాఖ శ్రీ శారదాపీఠం తరపున పట్టువస్త్రాలను అందించారు.

ఇవీ చూడండి..

ఏనుగుల సంచారం : భయాందోళనలో స్థానికులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details