ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోమాతను రక్షించారు... మానవత్వం చూపించారు! - gollapeta updates

ఆకలిని తీర్చుకునేందుకు పంట పొలంలోకి చేరింది ఓ గోవు. అందిన పచ్చని పైరును మేస్తూ ముందుకు సాగుతోంది. ఆకలిని తీర్చుకునే ధ్యాసలో గమనించలేదో ఏమో అది అందులోని బావిలో పడిపోయింది. వెంటనే ఆందోళనతో అరవసాగింది. ఇది గమనించిన చుటుపక్కల రైతులు అక్కడికి చేరి దానిని రక్షించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

cow
బావిలో పడిన ఆవు

By

Published : Aug 9, 2021, 8:14 AM IST

శ్రీకాకుళం రూరల్ మండలం గొల్లపేట గ్రామానికి చెందిన నీలంసెట్టి త్రినాథరావు అనే రైతు ఆవు.. మేత కోసం వెళ్లి ప్రమాదశాత్తు పొలంలోని బావిలో పడిపోయింది. అది గమనించిన రైతులు గ్రామానికి సమాచారం అందించారు. బావి వద్దకు చేరుకున్న రైతులు తాళ్ల సహాయంతో బయటకు లాగి దానిని కాపాడారు. అనంతరం గోమాతను పశు వైద్యుడి చూపించారు. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పటంతో రైతు ఊపిరి పీల్చుకున్నాడు.

గోమాతను రక్షించారు... మానవత్వం చూపించారు!

ABOUT THE AUTHOR

...view details