ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు - covid news in srikakulam dst

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఇసుక తవ్వకాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

villagers of srikakulam dst narsapuram prohibit sand mining in lockdown period
ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు...

By

Published : Apr 28, 2020, 5:56 PM IST

ఇసుక తవ్వకాలకు ఇతర ప్రాంతాల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా జనాన్ని తరలించడాన్ని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం పోతయ్య వలస గ్రామస్తులు నిలదీస్తున్నారు. పోతయ్య వలస సమీపంలోని వంశధార నదిలో ఇసుక రేవు నుంచి తవ్వకాలను ప్రారంభించడంపై అభ్యంతరం చెప్పారు.

కరోనా కారణంగా తామంతా లాక్ డౌన్ పాటిస్తుండగా ప్రభుత్వమే ఇసుక రేవులను తెరిచి నిబంధనలు ఉల్లంఘించడం తగదంటూ... తవ్వకాలను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సామాజిక దూరం పాటిస్తూ ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు గ్రామస్థులను ఒప్పించారు.

ABOUT THE AUTHOR

...view details