ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముద్దాడపేటలో ఇసుక తవ్వకాలపై గ్రామస్తుల అభ్యంతరం - శ్రీకాకుళం జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై నిరసన

శ్రీకాకుళం జిల్లా ముద్దాడపేటలో స్థానికులు ఆందోళన చేశారు. భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్న కారణంగా.. రహదారులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాపోయారు.

Villagers object to sand excavations in Muddadapeta srikakulam district
ముద్దాడపేటలో ఇసుక తవ్వకాలపై గ్రామస్థుల అభ్యంతరం

By

Published : Sep 17, 2020, 7:07 AM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడపేట సమీపంలోని నాగావళి నది నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీచ్​ల నుంచి ఇసుకను తరలిస్తున్న క్రమంలో.. సమీపంలోని భూముల్లో ఉన్న నీలగిరి, సరుగుడు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇసుక లారీలను అడ్డుకుని నిరసన చేపట్టారు. 15 రోజులుగా భారీ వాహనాలతో ఇసుకను తమ ప్రాంతం నుంచి తరలించుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details