ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకులు పట్టించుకోలేదు.. శ్రమదానంతో రోడ్డు నిర్మించుకున్న గ్రామస్థులు - పిల్లల కోసం గ్రామస్థులు రోడ్డు వేశారు

Road: తమ గ్రామానికి రహదారి కావాలని పాలకులకు విన్నవించి విసిగిపోయారు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. అధికారుల నుంచి స్పందన కరువై పాఠశాలకు వెళ్లే పిల్లలంతా రోజూ కాలి నడకన వెళ్లాల్సి వస్తోంది. ఇక ఫలితం లేకపోవటంతో పిల్లలు, పెద్దలు ఏకమయ్యారు. సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు రాళ్లు, పొదలను శ్రమదానం పేరుతో తొలగించి బడిపిల్లల కోసం బాటను వేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది.

Villagers
గ్రామస్తులు

By

Published : Jan 8, 2023, 7:16 PM IST

Road: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు శివారు నేరేడుబంధ గిరిజన గ్రామంలో సుమారు 70 మంది జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి పిల్లలంతా 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న జెడ్. జోగింపేట పాఠశాలకు నడిచి వెళ్లి వస్తుంటారు. రోడ్డు లేక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు కావాలని నాయకులు, అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక అనేక అవస్థలు పడ్డారు. ఇలాంటి సమయంలోనే అందరూ చేయిచేయి కలిపి రోడ్డు వేసుకోవాలని నిర్ణయించారు. అంతే రంగంలోకి దిగి సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు రాళ్లు, పొదలను శ్రమదానం పేరుతో తొలగించి రోడ్డు వేశారు.

తమకు రోడ్డు కావాలని నాయకులు, అధికారులకు అనేక రూపాల్లో వినతులు అందించాం. ప్రయోజనం లేకపోవటంతో శ్రమదానం పేరుతో రోడ్డును నిర్మించుకున్నామని గ్రామస్థులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details