ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గజరాజుల సంచారంతో.. గ్రామస్థులు బెంబేలు - elephants herd created problems in burjupadu

ఏనుగుల గుంపు.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైతులను వణికిస్తోంది. వరి కుప్పలపై నుంచి ఆ గుంపు వెళ్లిన కారణంగా.. పంటంతా నాశనమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

elephants
పంట నాశనం చేస్తున్న ఏనుగుల గుంపు

By

Published : Dec 27, 2020, 7:12 PM IST

పంట నాశనం చేస్తున్న ఏనుగుల గుంపు

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఏనుగుల గుంపు గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. బూర్జపాడులో నిన్న రాత్రి వరికుప్పలపైనుంచి వెళ్లి పంట నాశనం చేయగా.. రైతులు లబోదిబోమంటున్నారు. ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

కాశీబుగ్గ రేంజ్ అటవీ అధికారి పి. అమ్మనునాయుడు ఘటనా స్థలానికి చేరుకొని.. ఏనుగుల గుంపు కోసం అన్వేషణ ప్రారంభించారు. అడుగుల ఆధారంగా 4 పెద్దవి, ఒక పిల్ల ఏనుగు సంచరిస్తున్నట్టు గుర్తించారు. సన్యాసి పుట్టుగ, కేశపురం, డొంకూరు, చిన్న పెద్ద లక్ష్మీపురాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల గుంపును ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details