ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల పట్టాల పంపిణీపై ఇళ్లనాయుడువలస గ్రామస్థుల ఆందోళన - ఇళ్ల పట్టాలు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం రాజయ్యపేట పంచాయతీ పరిధిలో చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఇళ్ల నాయుడు వలస గ్రామస్థులు ఆరోపించారు. గ్రామంలో అర్హులు ఉన్నప్పటికీ తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వట్లేదంటూ.. ధర్నా చేశారు.

villagers protest against distribution of housing patta
ఇళ్ల పట్టాలు పంపిణీపై శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన

By

Published : Mar 28, 2021, 12:45 PM IST

అర్హులు ఉన్నప్పటికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదంటూ.. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం ఇళ్ల నాయుడు వలస గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రాజయ్యపేట పంచాయతీ పరిధిలో చేపట్టిన పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పట్టాల పంపిణీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా.. రాజయ్యపేట గ్రామానికి చెందిన 40 మంది, ఇళ్ల నాయుడు వలస చెందిన 8 మందికి అధికారులు పట్టాలు పంపిణీ చేశారు. తమ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఉన్నప్పటికీ ఇతర గ్రామస్థులకు ఎలా ఇస్తారని.. స్థానికులు ప్రశ్నించారు. అధికారుల తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details