ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్‌ నిలిపివేయడంతో.. సచివాలయ సిబ్బందిని బంధించిన గ్రామస్తులు - గ్రామస్తుల ఆగ్రహం

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట మండలం బొర్రంపేట సచివాలయ సిబ్బందిని గ్రామస్తులు నిర్బందించారు. గ్రామానికి చెందిన నలుగురుకి గత కొన్ని సంవత్సరాలుగా పింఛను అందుతున్నప్పటికీ, తాజాగా రావల్సిన ఛనును నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు సచివాలయ ఉద్యోగులను చుట్టుముట్టారు. రాత్రి 7గంటలకు పెన్షన్ ఇవ్వాలని..ఎంపీడీవో ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది.

సచివాలయ సిబ్బందిని బంధించిన గ్రామస్తులు
సచివాలయ సిబ్బందిని బంధించిన గ్రామస్తులు

By

Published : Nov 2, 2022, 9:41 AM IST

Updated : Nov 2, 2022, 9:56 AM IST

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట మండలం బొర్రంపేటకు చెందిన నలుగురు వృద్ధులకు పింఛన్‌ నిలిపివేయడంతో గ్రామస్థులు.. సచివాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎంపీడీవో కాళీ ప్రసాద్‌తో ఆదేశాలతో ఆపివేసినట్లు సిబ్బంది తెలపగా, అతను వచ్చేంత వరకు ఎవ్వరినీ బయటకు పోనీయమని.. సచివాలయంలోనే వారిని నిర్బంధించారు. విషయం తెలుకున్న ఎంపీడీవో సచివాలయానికి రావడంతో ముందస్తు సమాచారంలేకుండా ఏ కారణంతో నిలిపివేశారని.. ఆయనతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 4 పెన్షన్లపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో నిలుపుదల చేస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఎప్పటి నుంచో వస్తున్న వారికి ఇప్పుడెలా ఆపేస్తారని... ప్రశ్నించగా చేసేదేమిలేక వారికి పెన్షన్ ఇవ్వడంతో తగాద సద్దుమణిగింది.

సచివాలయ సిబ్బందిని బంధించిన గ్రామస్తులు
Last Updated : Nov 2, 2022, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details