శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ జరిగింది. కలెక్టర్ నివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. బలహీన వర్గాలపై దాడులు హేయమైన చర్య అనీ, భవిష్యత్తులో దాడులు పునరావృతం కాకూడదని అధికారులకు సూచించారు. లా అండ్ ఆర్డర్‌ను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
'నేర రహిత జిల్లాగా తయారుచేయండి' - శ్రీకాకుళంలో విజిలెన్స్ అండ్ మోనటరింగ్ సమావేశం
శ్రీకాకుళంను నేర రహిత జిల్లాగా తయారుచేయాలని సభాపతి తమ్మినేని సీతారాం కోరారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో తమ్మినేని పాల్గొన్నారు.
!['నేర రహిత జిల్లాగా తయారుచేయండి' vigilance and monataring committee meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5487474-524-5487474-1577261015708.jpg)
శ్రీకాకుళంలో విజిలెన్స్ అండ్ మోనటరింగ్ సమావేశం