ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చలించిన హృదయాలు.. కదిలొచ్చిన దాతలు - కూరగాయలు పంచిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి

కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయం అందిస్తూ చేయూతనిస్తున్నారు. నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు, ఆహారం ఇలా తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు.

vegetables distributed by kamalapuram former mla in kadapa distict
కూరగాయలు పంచిన మాజీ ఎమ్మెల్యే

By

Published : Apr 23, 2020, 9:22 AM IST

కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సుమారు 3 వేల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. కోగటం, కంచెన్నగారిపల్లెలో పేదలకు వాటిని అందజేశారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్​తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి తన వంతు సహాయం చేశానని ఆయన తెలిపారు.

కర్నూలు జిల్లా చిప్పగిరిలో జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షి గ్రామంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. నంద్యాలలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు జనసేన సైనికులు తమ వంతు సాయం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం హరిపురం దొడ్డ కాళీ గ్రామాల్లో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు, వలస కూలీల దాతలు సమకూర్చిన నిత్యావసర వస్తువులను రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో నిరంతరం సేవలందిస్తున్న80 మంది పారిశుద్ధ్య కార్మికులకు, 120 మంది వలస కూలీలకు సరకులు అందజేశారు.

రాజాంలోని రజక వీధిలో 160 నిరుపేద కుటంబాలకు బియ్యంతో పాటు 10 రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు పొగిరి సురేష్ బాబు ఆర్ధిక సౌజన్యంతో సమకూర్చిన వస్తువులను.. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అందజేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరులో యువకులు చందాలు వేసుకొని 400 కుటుంబాలకు గుడ్లు, పంచదార , అరటి పళ్ళు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి అరడజను గుడ్లు, డజను అరటిపళ్ళు , అరకేజీ పంచదార ప్యాకింగ్ చేసి ఇంటింటికీ తిరిగి అందజేశారు.

విజయవాడలో రెడ్ జోన్ ప్రాంతాలైన పాయకాపురం, శాంతినగర్, వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో సీపీఎం నేత చిగురుపాటి బాబూరావు పర్యటించారు. అక్కడి పేదలకు ఆహార పొట్లాలు, కూరగాయలు పంపిణీ చేశారు.

ప్రకాశం జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో అడ్డగడ్డ మల్లికార్జున్, శ్రీ కామాక్షి కేర్ ఆసుపత్రి సహకారంతో ఈపురుపాలెంలోని యానాది కాలనీ, శ్మశాన వాటిక దగ్గర ఉన్న నిరుపేదలకు ఆహార పొట్లాలు, పెరుగు పంపిణీ చేశారు.

ఇవీ చదవండి:

ప్రభుత్వ వైఫల్యానికి అనంతపురం జిల్లానే ఉదాహరణ: లోకేశ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details