శ్రీకాకుళం జిల్లా మందసలోని సుప్రసిద్ధ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత వాసుదేవుని కల్యాణ మహోత్సవం నిర్వహించారు. త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా వేడుకను జరిపించారు. భక్తి పాటల కచేరీలు, కోలాట నృత్యాల నడుమ గోవింద నామ సంకీర్తనలతో భక్తులు పులకించి పోయారు. వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాన్ని చూసేందుకు తరలివచ్చారు. సభాపతి తమ్మినేని సీతారాం, పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సతీసమేతంగా కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు.
వైభవంగా వాసుదేవుని కల్యాణం..భారీగా తరలివచ్చిన భక్తులు - minister appalaraju updates
శ్రీకాకుళం జిల్లాలో సుప్రసిద్ధ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ వేడుకను జరిపించారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం, పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సతీసమేతంగా కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు.
మందస గ్రామంతో తమకు విడిపోని బంధం ఉందని చినజీయరు స్వామి తెలిపారు. 1988లో శ్రీకూర్మం నుంచి పూరీ క్షేత్రానికిపాదయాత్రగా వెళ్తున్న సమయంలో మొదటిసారి గ్రామాన్ని సందర్శించామన్నారు. తన గురువు చదువుకున్న ఈ క్షేత్రం శిథిలావస్థకు చేరడంతో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు గ్రామస్థులు, దాతల సహకారంతో ఏడేళ్లపాటు పనులు జరిపించామన్నారు. 2009లో పెద్ద జీయరు స్వామి శతాబ్ది సందర్భంగా వైభవంగా ఈ ఆలయానికి పునఃప్రతిష్ఠ జరిపించామన్నారు. అప్పటినుంచి ప్రతి ఏడాది ఉత్సవాలకు తాను హాజరవుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి