కొవిడ్ రెండో డోసు టీకా కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యాక్సిన్ ఎప్పుడు..ఎక్కడ వేస్తారో తెలియక అర్హులు టీకా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే టీకా కేంద్రాలకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. తీరా అక్కడి సిబ్బంది దగ్గరున్న జాబితాలో కొంత మంది పేర్లు లేకపోవడంతో.. చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వాక్సినేషన్ కేంద్రాలు బోసి పోతున్నాయి. టీకా వేసుకునేందుకు.. ప్రజలు విముఖత చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వ్యాక్సిన్ కోసం పడిగాపులు - శ్రీకాకుళం వ్యాక్సిన్ వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు కొవిడ్ రెండో డోసు టీకా కోసం ఎగబడుతున్నారు. అక్కడికి వచ్చిన వారిలో కొంతమంది పేర్లు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వ్యాక్సిన్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
![శ్రీకాకుళం జిల్లాలో వ్యాక్సిన్ కోసం పడిగాపులు vaccine rush at srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11804263-505-11804263-1621332258540.jpg)
vaccine rush at srikakulam