శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని మద్యం దుకాణంలో చోరీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు లక్షల 80 వేల రూపాయల నగదును మద్యం దుకాణం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ప్రభుత్వ మద్యం దుకాణానికి వెనుక వైపుఉన్న గోడకు కన్నం పెట్టి లోపాలకు చోరబడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం విక్రయాలకు సంబంధించిన నగదు లాకర్లో పెట్టకుండా బయట ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. నరసన్నపేట సీఐ తిరుపతి, ఎస్ఐ సత్యనారాయణ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ.. లక్షల్లో నగదు మాయం - Theft at a government liquor store
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక ఉన్న గోడకు రంధ్రం చేసి దాని గుండా ప్రవేశించి నగదు అపహరించారని పోలీసులు వెల్లడించారు.

మద్యం దుకాణంలో చోరీ