శ్రీశైలం క్షేత్ర పరిధిలోని హఠకేశ్వరం సమీపంలోని అడవిలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందినట్లుగా పోలీసులు నిర్ధరించారు. చాలా రోజుల క్రితం వ్యక్తి మృతి చెంది ఉన్న కారణంగా.. శవం కుళ్లిపోయింది. మృతుడు ఎవరు ? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీశైలం అడవుల్లో గుర్తుతెలియని మృతదేహం - Srisailam forest
పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీశైలం క్షేత్ర పరిధిలోని హఠకేశ్వరం అడవిలో చోటుచేసుకుంది. మృతుడి వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
గుర్తుతెలియని మృతదేహం