వైకాపాది నిరంకుశత్వ పాలన అని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. రివర్స్ టెండర్స్, రివర్స్ పాలనతో తెదేపా నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం విషయంలో నోటిమాటలు తప్ప చేతల్లో ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. బోటు ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా... ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇసుక దందాలు, కమీషన్ కోసం కక్కుర్తి పడటం తప్ప ప్రజలకు చేసేదేమీ లేదని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారని విమర్శించారు.
వైకాపా పాలనలో.. రాష్ట్రాభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి: కళా - వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి ఇరవైఏళ్లు వెనక్కి : కళా
వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి ఇరవైఏళ్లు వెనక్కి వెళ్లిందని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. వైకాపా నేతలవి మాటలే తప్ప.. చేతల్లో ఏమీ చేయలేదని ఆరోపించారు.
వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి ఇరవైఏళ్లు వెనక్కి