ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొడుగు ఉంటేనే ముందుకు.. లేకుంటే వెనక్కే.. - పాలకొండలో మద్యం కొనేందుకు గొడుగు లేకుండా వచ్చిన జనం

మద్యం దుకాణాలకు వచ్చేవారు తప్పనిసరిగా గొడుగు, మాస్కులు తీసుకురావాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అయినా కొంతమంది అవి లేకుండానే రావటంతో.. వారిని పోలీసులు, దుకాణ సిబ్బంది వెనక్కి పంపుతున్నారు.

umbrella and mask compulsory for wine purchase
గొడుగు ఉంటేనే ముందుకు.. లేకుంటే వెనక్కే..

By

Published : May 6, 2020, 2:14 PM IST

మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వ నిబంధనలు అమలు చేయటంతో మందుబాబులు అవస్థలు పడుతున్నారు. గొడుగు ఉంటేనే మద్యం ఇస్తామని దుకాణ సిబ్బంది చెప్పటంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 7 మద్యం షాపులు ఉండగా.. అన్నింటివద్దా జనం బారులు తీరారు. గొడుగు, మాస్కు లేకుండా వచ్చినవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా పోలీసులు వెనక్కి పంపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details