నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు నిర్మాణాల ప్రగతిపై బుధవారం నరసన్నపేటలో ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు సమీక్షించారు. రూ.700 కోట్లతో నిర్మించే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు 2022 ఆగస్టు మొదటి వారానికి అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఆ దిశగా సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయని వివరించారు. అలాగే శ్రీముఖలింగం రెండవ దశ పనులు కూడా చేస్తామన్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణాలకు నియోజకవర్గాల వారీగా ఇంజనీరింగ్ శాఖలు బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మరో పదివేల మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు.
ఆగస్టు 2022 వరకు అందుబాటులోకి ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు - ఆగష్టు 2022 వరకు అందుబాటులోకి ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు
పలు అభివృద్ధి పనులపై నరసన్నపేటలో అధికారులు సమీక్ష నిర్వహించారు. 700 కోట్లతో నిర్మించే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు 2022 ఆగస్టు మొదటి వారానికి అందుబాటులోకి వస్తుందని ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు తెలిపారు.
![ఆగస్టు 2022 వరకు అందుబాటులోకి ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు Uddanam Drinking Water Project Available by August 2022](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8823764-223-8823764-1600257357878.jpg)
ఆగష్టు 2022 వరకు అందుబాటులోకి ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ డీఈ ఆర్. రామం పలువురు ఏఈ లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: పాముకాటుతో తల్లి, కుమార్తె మృతి