వేర్వేరు ప్రాంతాల్లో.. విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి - latest news in srikakulam district
08:29 August 13
ముగ్గురు మృతి
విద్యుదాఘాతంతో వేరు వేరు ప్రాంతాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పొన్నుటూరులో వరి పొలంలో పని చేస్తుండగా.. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కొత్తూరు మండలం కొత్తగూడ వాసులుగా గుర్తించారు.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం సూరేపల్లి గ్రామంలో నాగేంద్ర ప్రసాద్ అనే రైతు తన పొలంలో అరటి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి.. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తూ విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదీ చదవండీ.. 'వందేళ్ల ఉత్సవం నాటికి దేశం ఫిట్ ఇండియాగా మారాలి'