శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం శొంఠినూరులోని ఎస్‌కేఎస్ ఎక్స్‌పోర్ట్స్ గ్రానైట్ క్వారీలో.. శనివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గ్రానైట్ రాయిని డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో రాయి దొర్లిపడటంతో.. దాని కింద చిక్కుకున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
TWO DIED: గ్రానైట్ క్వారీలో ప్రమాదం.. ఇద్దరు మృతి - Accident at a granite quarry
గ్రానైట్ క్వారీలో రాయిని డ్రిల్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ.. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం శొంఠినూరులో ఈ ఘటన జరిగింది.
గ్రానైట్ క్వారీలో ప్రమాదం
మృతుల్లో ఒకరు టెక్కలి మండలం భగవాన్ పురం గ్రామానికి చెందిన పొన్నాడ బాబూరావుగా.. మరో వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉత్తమ్‌గా గుర్తించారు. భారీ రాయి కింద మృతదేహాలు చిక్కుకోవడంతో అర్ధరాత్రి దాటే వరకు తొలగింపు ప్రక్రియ సాగింది.
ఇదీ చదవండీ..LHB COACHES: భువనేశ్వర్‌కు తరలిపోయిన విశాఖ నూతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు