శ్రీకాకుళం జిల్లా పొందూరులో బాణాసంచా పడి రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గొడగళ్ల పేట కాలనీలో తారాజువ్వలు ఇంటి మీద పడడంతో.. యడ్ల శ్రీను, యడ్ల సూర్యనారాయణకు చెందిన ఇళ్లు కాలిపోయాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఆ రెండు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే సర్వం బూడిదయ్యింది. పండుగ పూట ఈ ఘటన జరగడంతో బాధితులు బోరున విలపిస్తున్నారు.
అగ్నిప్రమాదం: తారాజువ్వలు పడి రెండు పూరిళ్లు దగ్ధం - తారాజువ్వల ధాటికి పొందూరులో రెండిళ్లు దగ్ధం
దీపావళి పండుగ రెండిళ్లలో విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా పొందూరులో అప్పటివరకు సంతోషం గడిపిన యడ్ల శ్రీను, యడ్ల సూర్యనారాయణ కుటుంబాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. తారాజువ్వలు పడి వారి పూరిళ్లు దగ్దమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకొనేలోపే సర్వం బూడిదయ్యింది.
ఎగిసిపడుతున్న మంటలు